News April 24, 2025
నిర్మల్: 6277 ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ

జిల్లాలో ఇప్పటి వరకు 6277 మంది ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి రుసుము చెల్లించారని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో 44,602 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఆమోదం పొందిన దరఖాస్తులు 6277 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించి తమ దరఖాస్తులను క్రమబద్ధీకరించుకున్నారని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST
News March 13, 2026
తిరుపతి: శ్రీరమాదేవి హాస్పిటల్‌పై విచారణ

తిరుపతిలోని శ్రీరమాదేవి హాస్పిటల్‌పై తమకు ఫిర్యాదు అందినట్లు DMHO బాలాజీ నాయక్ తెలిపారు. పలమనేరు నుంచి బ్రెయిన్ డెడ్‌తో వచ్చిన శ్రీనివాస్‌కు సర్జరీ చేశారు. తర్వాత హార్ట్ స్ట్రోక్‌తో మృతిచెందారు. డబ్బుల కోసం <<19345828>>మృతదేహాన్ని ఇవ్వలేదనే <<>>ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, 2వారాల్లో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని DMHO తెలిపారు. తానే ఫోన్ చేసి మృతదేహాన్ని ఇవ్వాలని ఆసుపత్రి యజమానికి సూచించానన్నారు.
News March 13, 2026
HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.


