News April 23, 2025

నిర్మల్: INTER RESULTSలో అమ్మాయిలదే పైచేయి

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 43.54 శాతంతో ఉత్తీర్ణత సాధించగా బాలికలు 70.84 శాతం మంది పాసయ్యారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం బాలురది 54.31గా ఉండగా బాలికలు 80.93గా సాధించారు. జిల్లాల మొత్తానికి ఫలితాల సాధనలో బాలికలదే పైచేయి సాధించారు.

Similar News

News March 14, 2026

సిలిండర్ల బుకింగ్ మాటున సైబర్ కేటుగాళ్లు

image

TG: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘వారు పంపే APK ఫైళ్లను ఓపెన్ చేయొద్దు. సిలిండర్ తక్షణ డెలివరీ, ముందస్తు చెల్లింపులు అంటూ వచ్చే కాల్స్‌ను నమ్మొద్దు. బుకింగ్‌కు అధికారిక వెబ్సైట్లను వినియోగించాలి. లేదా ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలి. http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.

News March 14, 2026

కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు విరాళాల ద్వారా ఆర్థిక సాయం

image

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు విరాళాలు సేకరించిన స్థానికులు ఇవాళ వారికి అందజేశారు. గత సంవత్సరం నవంబర్ 29న కొండగట్టు దిగువన సంభవించిన అగ్నిప్రమాదానికి దాదాపు 23 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. భాదితులకు సహాయం చేయడానికి స్థానిక యువత, ప్రజలు తమ వంతు సహాయంగా “Helping Hands for Kondagattu Fire Accident” అనే గ్రూప్ తయారు చేసి, విరాళాలు సేకరించారు. సేకరించిన రూ.5,73,000 బాధితులకు అందజేశారు.

News March 14, 2026

నిర్భయ నిధి కింద రాష్ట్రంలోని ములుగు జిల్లా ఎంపిక

image

నిర్భయ నిధి కింద “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” పథకానికి ములుగు జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాల్నా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీతక్క పేర్కొన్నారు.