News February 8, 2025

నిర్మల్:100% ఇంటి పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

image

పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాలలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇందులో జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఎంపీలు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2026

నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

image

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.

News February 19, 2026

మండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో కూటమి, YCP సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తిరుమల లడ్డూ అంశం, ఇందాపూర్ డెయిరీ TTDకి నెయ్యి సరఫరాపై చర్చకు YCP వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘హెరిటేజ్‌పై YCP తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆధారాలు తీసుకురమ్మంటే స్పందన లేదు’ అని మండిపడ్డారు.

News February 19, 2026

భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

image

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.