News August 22, 2024
నీటి పైపు లైన్‌కు శంకుస్థాపన చేసిన ఒంగోలు MP

ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 వద్ద నవోదయ స్కూల్‌కి వెళ్లే నీటి పైపులైన్‌కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నవోదయ స్కూల్ విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ సుజాత, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ‘ఎస్పీ మీకోసం’ కార్యక్రమం రద్దు: SP

జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు, ఆయా జిల్లాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News January 24, 2026
ప్రకాశం: స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఉల్లగల్లుకి చెందిన తప్పెట చిన్ని ఒంగోలులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య రాజ్యంతో కలిసి స్కూటీపై ఉల్లగల్లులోని బ్యాంకు పని చూసుకోని వెళ్తున్నారు. శంకరాపురం- తిమ్మాయపాలెం మధ్యలో స్కూల్ బస్ స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్ని అక్కడికక్కడే చనిపోయాడు. రాజ్యానికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
News January 24, 2026
మార్కాపురం: రెండు బస్సులు ఢీ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


