News August 22, 2024
నీటి పైపు లైన్‌కు శంకుస్థాపన చేసిన ఒంగోలు MP

ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 వద్ద నవోదయ స్కూల్‌కి వెళ్లే నీటి పైపులైన్‌కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నవోదయ స్కూల్ విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఒంగోలు నగర మేయర్ సుజాత, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.