News November 8, 2025

నీలంవలస జలపాతాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పాచిపెంట మండలం నీలంవలస జలపాతాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి జలపాతం పరిశీలించి, అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం జలపాతం వద్ద స్నానం చేశారు. సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, సబ్ కలెక్టర్ వైశాలి, తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు ఉన్నారు.

Similar News

News January 24, 2026

అల్లూరి: నేటి నుంచి యథావిధిగా బస్‌లు

image

అల్లూరి, పోలవరం, అనకాపల్లి జిల్లాలకు శనివారం ఉదయం నుంచి యథావిధిగా బస్‌లు నడుస్తాయని ఏలేశ్వరం RTC DM జీవి సత్యనారాయణ తెలిపారు. ఏలేశ్వరం, జె. అన్నవరం రోడ్డు నిర్మించాలని కోరుతూ ప్రజా సంఘాలు 2 రోజులుగా నిరసన కార్యక్రమం జరగడంతో బస్‌లు నిలిపివేశామన్నారు. అడ్డతీగల, వై.రామవరం, నర్సీపట్నం, కొయ్యూరు, రాజవొమ్మంగి తదితర ప్రాంతాలకు బస్ సర్వీస్‌లు నడుస్తాయని వెల్లడించారు.

News January 24, 2026

వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.