News December 2, 2025
‘నువ్వు నాకేం ఇస్తావ్.. నేను నీకేం ఇవ్వాలి’

1ST ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో లాస్ట్. 398 GPలకు ఎన్నికలు జరుగుతుండగా 43 పంచాయతీలకు 3లోపే నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామపెద్దలు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీమైతే ప్రభుత్వం ఇచ్చే నజరానాతోపాటు ఎన్నికలకయ్యే ఖర్చు తగ్గుతుందంటూ సర్పంచ్ అభ్యర్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు లక్షల్లో డిమాండ్ చేస్తూ వేలంపాటలకు సై అంటున్నారు.
Similar News
News February 7, 2026
RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను ఊహించుకున్నారనే మీమ్‌ను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.
News February 7, 2026
సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్‌వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
చిత్తూరు: ఏనుగుల దాడులకు ‘హనుమాన్’తో చెక్.!

రామకుప్పం(M)లో ఏనుగు ధాటికి పాడి <<19074524>>ఆవు<<>> మృతి చెందగా, GDనెల్లూరు నియోజకవర్గంలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. HANUMAN ప్రాజెక్ట్‌లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్, శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది, డ్రైవర్, ఆధునిక వాహనాలు, ట్రాంక్విలైజేషన్ పరికరాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. జంతువులు నివాస ప్రాంతాల్లోకి వెళ్లగానే ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.


