News March 27, 2024

నూతన ఓటర్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్

image

గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు, మార్పులు చేర్పులు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్తగా వచ్చిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సత్యసాయి జిల్లాకు కొత్తగా 1,34,364 ఎపిక్ కార్డులు వచ్చాయని, వీటిని ఆయా నియోజకవర్గాల వారీగా విభజన చేసి తపాలా శాఖ ద్వారా చిరునామాలకు పంపుతున్నామన్నారు.

Similar News

News February 18, 2026

ఈ-పంట నమోదు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను యుద్ధప్రతిపాదికన ముగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

News February 18, 2026

అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.

News February 17, 2026

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

image

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.