News August 11, 2025
నూతన చట్టాల ద్వారా దర్యాప్తు పూర్తి చేయాలి: ఎస్పీ

నూతన చట్టాల ద్వారా కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సాక్ష్య, ఈ సమాన్స్, ఆన్లైన్ ఫిర్యాదులు, జీరో ఎఫ్ఐఆర్ వంటి సాంకేతిక విధానాలను సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 12, 2026
ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.
News March 12, 2026
శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
News March 12, 2026
NZB: ప్రజా ప్రతినిధుల శిక్షణ సదస్సు ప్రారంభం

నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కార్పొరేట్లరు, ఛైర్మన్లు పాల్గొన్నారు.


