News August 25, 2024
నెల్లిమర్ల నియోజకవర్గానికి గుడ్‌న్యూస్ చెప్పిన పవన్

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో నెల్లిమర్లకు చోటు దక్కడంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన కొండవెలగాడ రహదారిలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
News January 12, 2026
VZM: ‘పీజీఆర్ఎస్‌ని ప్రజలు వినియోగించుకోవాలి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 11, 2026
VZM: ఆకాశమే హద్దు.. పతంగులతో పిల్లల ఆటలు

సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిల్లల్లో పతంగులు ఎగరవేయాలనే ఉత్సాహం పెరిగింది. రంగురంగుల పతంగులు, మాంజా దారాల కొనుగోలులో పిల్లలు బిజీగా ఉన్నారు. మైదానాలు, ఇంటి టెర్రస్‌లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. గాజు మాంజా వాడకూడదని విజయనగరం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగల దగ్గర పతంగులు ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.


