News November 30, 2025

నెల్లూరుకు చేరుకున్న NDRF బృందాలు

image

తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లాకు NDRF బృందాలు చేరుకున్నాయి. డీఎస్పీ ఆఫీస్ దగ్గరకు NDRF టీం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావొద్దని సూచిస్తున్నారు.

Similar News

News February 10, 2026

ఆత్మకూరు: పెళ్లి చేసుకొని బంగారంతో మహిళ పరార్!

image

ఓ మహిళ పెళ్లి చేసుకొని నగలతో పరారైన ఘటన ఇది. బాధితుడి వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సుబ్బారావును రెండో పెళ్లి చేసుకుంది. ఆయన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు తీసుకుని పరారైంది. ఆత్మకూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో ఇలా పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు.

News February 10, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి నాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

News February 10, 2026

నెల్లూరు: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా చదువు..!

image

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం, MRCలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.