News January 18, 2025

నెల్లూరుకు నీరు రావడం NTR పుణ్యమే: సోమిరెడ్డి

image

తెలుగుగంగ ప్రాజెక్టును రూపొందించి నెల్లూరు నేలను కృష్ణా జలాలతో తడిపిన ఘనత నందమూరి తారక రామారావుదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమేనన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌తో అప్పట్లో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.

Similar News

News February 12, 2025

కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 12, 2025

మర్రిపాడు వద్ద హైవేపై ఘోర ప్రమాదం.. బాలుడి స్పాట్ డెడ్ 

image

మర్రిపాడులోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కస్తూర్బా గాంధీ కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నన్నోరుపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(16) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 12, 2025

నాయుడుపేటలో వ్యభిచార గృహంపై దాడి

image

నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ నాయుడుపేటలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!