News April 27, 2024

నెల్లూరులో ఒకే రోజు బావబామ్మర్దుల ప్రచారం

image

సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా శనివారం నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రముఖుల ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నారా చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభలు నిర్వహిస్తుండగా, వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ రోడ్ షో జరగనుంది.

Similar News

News April 16, 2026

నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

image

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.

News April 16, 2026

నెల్లూరు GGH ఉద్యోగాల మెరిట్ జాబితా విడుదల

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ‘డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్’లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మార్చి 31‌-ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను spsnellore.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల (ఏప్రిల్) 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు

News April 16, 2026

రాంగ్ రూట్‌లో వస్తే వాహనాలను సీజ్ చేయాలి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.