News December 3, 2025
నెల్లూరులో టెక్స్‌టైల్స్ పార్క్ ఏది: లోక్ సభలో వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసిందనేది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.103 కోట్లతో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఏమయ్యాయని అడిగారు. దీనికి కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరెట్ సమాధానమిస్తూ ప్రభుత్వం 2015లో ప్రకటించిందని, త్వరలో పూర్తి చేస్తామని, రూ.20 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
Similar News
News February 17, 2026
కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.
News February 17, 2026
నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO వరప్రసాద్

* ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
* నెల్లూరు జిల్లాలో 53,404 మంది ఇంటర్ విద్యార్థులు
* ఫస్ట్ ఇయర్ 26,935 మంది
* సెకండ్ ఇయర్ 26,469 మంది
* జిల్లాలో 81 పరీక్షా కేంద్రాలు
* 1150 మంది ఇన్విజిలేటర్ల నియామకం
* సిట్టింగ్ స్క్వాడ్స్ 5.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 4 ఏర్పాటు
* పరీక్షా సమయం 9AM నుంచి 12PM
* ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్స్
*పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, సామాగ్రి సిద్ధం చేసుకోండి
News February 17, 2026
పొదలకూరు : ఇంటి ముందు బైక్ దహనం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో గుడిపాటి రమణయ్య ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైకుకు నిప్పంటించారు. రెండు రోజుల క్రితం ఇంటి గేటుకు కరెంట్ వైర్ తగిలించిన ఘటనతో కుటుంబం భయాందోళనలో ఉంది. తమపై కుట్ర జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


