News May 7, 2025
నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య

నెల్లూరులో ప్రేమజంట మృతి కలకలం రేపింది. జోసఫ్ రత్నకుమార్(తూ.గో), శ్రావణి(కృష్ణా) నాలుగు రోజుల కిందట రైల్వే ఫీడర్స్ రోడ్డులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. ఈక్రమంలో శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. మూడు రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Similar News
News February 10, 2026
నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.
News February 10, 2026
ఆత్మకూరు: పెళ్లి చేసుకొని బంగారంతో మహిళ పరార్!

ఓ మహిళ పెళ్లి చేసుకొని నగలతో పరారైన ఘటన ఇది. బాధితుడి వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సుబ్బారావును రెండో పెళ్లి చేసుకుంది. ఆయన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు తీసుకుని పరారైంది. ఆత్మకూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో ఇలా పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు.
News February 10, 2026
నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

TDP లో సమిష్టి నాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.


