News April 12, 2024
నెల్లూరు: అప్పుడు 4.. ఇప్పుడు 8

నెల్లూరులో గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 25,535 మందికి 17042 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈసారి 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం(69) పెరిగినా 8వ స్థానానికి పడిపోయింది. అలాగే సెకండ్ ఇయర్‌లో గతేడాది 22,789 మందికి 17,438 మంది పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇవాల్టి ఫలితాల్లో 81 శాతంతో 6వ స్థానానికే పరిమితమైంది.
Similar News
News December 14, 2025
నెల్లూరు: వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేదాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు నగరం వేదాయపాలెంలోని జనశక్తి నగర్‌కు చెందిన వొలిపి వెంకటేశ్వర్లు (63) జీవితంపై విరక్తి చెంది వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లోని సౌత్ యార్డ్ వద్దకు వచ్చి రైలు కింద పడ్డాడు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయింది. రైల్వే ఎస్ఐ హరిచందన కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 14, 2025
నెల్లూరు కలెక్టర్‌కు రాజీనామా లేఖ పంపిన మేయర్

నెల్లూరు మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆదివారం మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా లేఖ ఆమోదించిన తర్వాతనే క్యాంపులో ఉండే కార్పొరేటర్లు నెల్లూరుకు వస్తారని సమాచారం.
News December 14, 2025
నెల్లూరులో ఎత్తులకు పైఎత్తులు.. మేయర్ ట్విస్ట్!

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కిడ్నాప్, బెదిరింపులకు దారి తీసింది. TDP, YCP నాయకులు పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలనే ఉద్దేశంతో TDP నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కొందరికి డబ్బులు ఆఫర్ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం కోసం ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే రాజీనామాతో స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఉండదని తెలుస్తోంది.


