News August 22, 2025

నెల్లూరు: ఆ ఇద్దరూ కాకపోతే ఇంకెవరు?

image

నెల్లూరు జైలులో ఉన్న శ్రీకాంత్ పెరోల్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అతనికి ఫెరోల్ ఇవ్వాలంటూ నెల్లూరు రూరల్, గూడూరు MLAలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్ సిఫార్స్ లేఖలు ఇవ్వగా జులై 16న వాటిని జైళ్లశాఖ తిరస్కరించింది. జులై 30న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్యే లెటర్లు రిజెక్ట్ చేసిన తర్వాత పెరోల్ రావడం వెనుక ఎవరి సిఫార్సు ఉందనేది తెలియాల్సి ఉంది.

Similar News

News January 21, 2026

తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

image

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.

News January 21, 2026

నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.

News January 21, 2026

నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

image

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.