News June 18, 2024
నెల్లూరు: ఇంకా కోలుకోని YCP నేతలు..!

నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఆ ఘోర ప్రభావం నుంచి నేతలు ఇంకా కోలుకోలేదు. ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్లు ఎవరూ ఇప్పటికీ చాలామంది ప్రజల్లోకి రాలేదు. నిన్న బక్రీద్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పలు చోట్ల ప్రార్థనల్లో పాల్గొనగా.. వైసీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల పోస్ట్‌లకే పరిమితమయ్యారు. మరోవైపు నేతల భరోసా కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
Similar News
News January 12, 2026
నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.
News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
News January 12, 2026
ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్‌గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


