News April 2, 2024
నెల్లూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ప్రభుత్వ టీచర్‌పై వేటు

వరికుంటపాడు మండలం రామదేవులపాడులో రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయసంకల్ప యాత్రలో వింజమూరు మండలం నందిగుంట ఉపాధ్యాయుడు జక్కం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై నోడల్ అధికారి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతయ్య తెలిపారు.
Similar News
News February 10, 2026
SVU : డిగ్రీ పూర్వ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.
News February 10, 2026
నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లుకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంట్రీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాల్సి ఉంది.
News February 10, 2026
ఉదయగిరి: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్ ?

దేశంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోని వారి కార్డులు నిలిపివేసినట్లు ఉదయగిరి ఆధార్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ చేయాలనుకున్న ముందుగా వాటి చెల్లుబాటు స్థితి తప్పనిసరిగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. రద్దు చేయబడిన, నిలిపివేయబడిన, చెల్లుబాటు కోల్పోయిన వారు ప్రాథమిక ఆధార్ కేంద్రాలను లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.


