News April 27, 2024

నెల్లూరు : కోటంరెడ్డి ఇంటికి బాలకృష్ణ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆదిత్య నగర్ లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం బాలకృష్ణను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు.

Similar News

News April 13, 2026

డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

image

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.

News April 12, 2026

నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.

News April 12, 2026

నెల్లూరులో MPపై పోలీస్ కేసు నమోదు

image

నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి తదితరులపై కేసు నమోదైంది.