News August 5, 2024

నెల్లూరు క్లబ్ పాలకవర్గానికి 18 నామినేషన్‌లు

image

నెల్లూరు క్లబ్ ఎన్నికలకు సంబంధించి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ వాడివేడిగా ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ సంబంధించి మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారి వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు ఆమోదముద్ర వేశారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది.

Similar News

News December 15, 2025

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

image

నెల్లూరు నగర మేయర్‌గా స్రవంతి చేసిన రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే దాకా.. కార్పొరేషన్‌లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News December 15, 2025

బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

image

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.

News December 15, 2025

నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

image

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్‌ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.