News April 26, 2024

నెల్లూరు: చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.. 3.30 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బుచ్చిలో జరిగే సభకు హాజరవుతారు. రాత్రికి బుచ్చిలోనే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తెలిపాయి.

Similar News

News April 14, 2026

నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.

News April 14, 2026

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.

News April 14, 2026

ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

image

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.