News June 29, 2024
నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడి..ఏడేళ్లు జైలు

బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా పడింది. ప్రత్యేక పోక్సో జిల్లా రోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. గూడూరులోని చవటపాలేనికి చెందిన వీరయ్య 2015లో బాలికకు మిఠాయి ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అమ్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.
Similar News
News February 11, 2025
నెల్లూరు జిల్లా హెడ్‌లైన్స్

✒ శంకరనగరంలో తల్లిని కాపాడబోయి.. కొడుకు మృతి
✒ బెడ్ కాఫీ బదులు బెడ్ లిక్కర్: కాకాణి
✒విడవలూరులో రోడ్డు విస్తరణ వద్దంటూ ఆందోళన
✒కందుకూరు MROతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం
✒అల్లూరు దర్గా సమాధిలో కదలికలు
✒కొండాపురంలో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
✒నెల్లూరు ప్రజలరా.. ఆ లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ
News February 11, 2025
నెల్లూరు: తల్లిని కాపాడబోయి వాగులో మునిగి యువకుడి మృతి

అనంతసాగరం మండలం శంకర్ నగరం గ్రామం వద్ద కొమ్మలేరు వాగులో మునిగి ఉప్పలపాటి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. వాగు సమీపంలో గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి వాగులో పడిపోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి వాగులో మునిగి ఆకాశ్ మృతి చెందాడు. కళ్లముందే కొడుకు వాగులో మునిగి చనిపోవడంతో తల్లి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీటెక్ చదివిన ఆకాశ్ మృతి చెందడంతో శంకర్ నగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 11, 2025
మోసపూరిత SMSలపై అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.