News November 30, 2025

నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. భారీ వృక్షాల వద్ద నిలబడరాదని, పాత భవనాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లాలో కూడా RED అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News February 8, 2026

నెల్లూరు: శివరాత్రికి భక్తుల సందడి ఎక్కడంటే..?

image

మహాశివరాత్రి వచ్చిందంటే జిల్లాలోని శివభక్తులు పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కృష్ణపట్నం సిద్ధేశ్వర స్వామి, సముద్ర తీరాన వెలసిన కాటేపల్లి శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్తారు. ప్రకృతి ప్రేమికులు వెంకటాచలం అడవిలోని శివాలయంలో ఏకాంతంగా స్వామిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక మైపాడు తీరాన సముద్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ.

News February 8, 2026

నెల్లూరు: మురుగుతున్న MP LADS

image

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులకు భారత ప్రభుత్వం MP LADS ను కేటాయిస్తుంది. వేమిరెడ్డికి రూ. 9.80 కోట్లను కేటాయించగా.. రూ. 5.06 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని సమాచారం. బీద మస్తాన్ రావుకు రూ.12.22 కోట్లు ఇవ్వగా రూ.3.37 కోట్లకు పనులు చేపట్టారు. కనీసం కొన్ని పనులు కూడా మొదలెట్టలేదంటే ఎలా ఖర్చు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News February 7, 2026

నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.