News November 30, 2025
నెల్లూరు జిల్లాలోని కాలేజీలకు కూడా సెలవు

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఆదేశాలకు విరుద్ధంగా కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీలు, స్కూళ్లకు ఇప్పటికే సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 12, 2026
నెల్లూరులో జనసేనను నడిపించేది ఎవరు..?

నెల్లూరులో జనసేనను నడిపించే నాయకుడు కనబడటం లేదు. గతంలో మనుక్రాంత్ రెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆయన YCPలో చేరారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిని నియమించలేదు. అజయ్ కుమార్ పార్టీని నడిపినా.. ఆయనపై అసమ్మతితో తప్పించి విచారణ కమిటీ వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్షుడు లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఉనికి దెబ్బతింటుందని కార్యకర్తలు వాపోతున్నారు.
News February 12, 2026
చిత్త శుద్ధితో విధులను నిర్వహించండి: కలెక్టర్

అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.