News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.
Similar News
News February 10, 2026
ఆత్మకూరు: పెళ్లి చేసుకొని బంగారంతో మహిళ పరార్!

ఓ మహిళ పెళ్లి చేసుకొని నగలతో పరారైన ఘటన ఇది. బాధితుడి వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సుబ్బారావును రెండో పెళ్లి చేసుకుంది. ఆయన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు తీసుకుని పరారైంది. ఆత్మకూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో ఇలా పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు.
News February 10, 2026
నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

TDP లో సమిష్టి నాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.
News February 10, 2026
నెల్లూరు: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా చదువు..!

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం, MRCలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


