News April 12, 2024

నెల్లూరు జిల్లాలో యువతి దారుణ హత్య

image

జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంకు చెందిన భయ్యా రాణి అనే యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఊచగుంటపాలెంకు చెందిన కొత్తూరు అనుప్ అనే వ్యక్తి ఆమెను బంగారం కోసం పెట్రోల్ పోసి తగలబెట్టాడని పోలీసులతో చెప్పారు. జువ్వలదిన్నె తిప్పలేరు కాలువ వద్ద ఆమె శవం లభించింది.

Similar News

News December 11, 2025

15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

image

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.

News December 11, 2025

నెల్లూరు కలెక్టర్ చొరవతో నిమ్మ రైతులకు ఊరట

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవ చూపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి జిల్లాలోని నిమ్మ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే నిమ్మను ఆయా జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిమాండ్ ఉన్న ఇతర జిల్లాలతో కూడా సంప్రదించాలని అధికారులకు సూచించారు.

News December 10, 2025

నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

image

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.