News November 30, 2025

నెల్లూరు జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇచ్చేలా DyEOs, MEOs, HMs అందరూ చర్యలు తీసుకోవాలని డీఈవో బాలాజీ రావు ఆదేశించారు. నెల్లూరులో సోమవారం జరగాల్సిన PGRS కూడా రద్దు చేశారని తెలిపారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

image

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు(AWS) రైతులు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని చెప్పారు.