News December 1, 2025

నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

image

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.

Similar News

News February 12, 2026

​నెల్లూరులో జనసేనను నడిపించేది ఎవరు..?

image

నెల్లూరులో జనసేనను నడిపించే నాయకుడు కనబడటం లేదు. గతంలో మనుక్రాంత్ రెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆయన YCPలో చేరారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిని నియమించలేదు. అజయ్ కుమార్ పార్టీని నడిపినా.. ఆయనపై అసమ్మతితో తప్పించి విచారణ కమిటీ వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్షుడు లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఉనికి దెబ్బతింటుందని కార్యకర్తలు వాపోతున్నారు.

News February 12, 2026

చిత్త శుద్ధితో విధులను నిర్వహించండి: కలెక్టర్

image

అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు‌లో ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.