News March 27, 2024
నెల్లూరు: ప్రచారంలో నేతల వారసులు

నెల్లూరులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని చోట్ల నేతల వారసులు ప్రచారంలో మెరుస్తున్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ భార్య, నారాయణ భార్య, కుమార్తెలు, రూరల్‌లో కోటంరెడ్డి కుటుంబసభ్యులు, కోవూరులో ప్రశాంతిరెడ్డి కుమారుడు, కుమార్తె, నల్లపరెడ్డి కుమారుడు, సర్వేపల్లిలో కాకాణి కుమార్తె, సోమిరెడ్డి కుమారుడు, కోడలు, గూడూరులో పాశం భార్య ప్రచారంలో నిమగ్నమయ్యారు.
Similar News
News February 15, 2026
ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News February 14, 2026
నెల్లూరు: వాట్సప్‌కు పరిమితమైన ప్రేమ సందేశాలు

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే వారం రోజుల నుంచి గ్రీటింగ్ కార్డులు, రోజా పువ్వులు, కవితలతో కూడిన లేఖలు ఇచ్చి తమ ప్రేమను తెలియపరచాలని ప్రేమికులు ఎదురుచూస్తుండే వారు. అయితే ఇప్పుడు కేవలం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ సందేశాలు పెట్టుకొని తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. షాపుల్లో కనీసం గ్రీటింగ్ కార్డులు కనబడని పరిస్థితి ఏర్పడింది. 90’S కిడ్స్ మాత్రం తమ రోజులే బాగున్నాయని ఆనంద పడుతున్నారు.