News October 5, 2025
నెల్లూరు: బానిసత్వం నుంచి విముక్తి

నెల్లూరు(D) కాకుటూరుకు చెందిన ముగ్గురు మైనర్లకు విముక్తి లభించింది. వీళ్లను బానిసలుగా చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఈక్రమంలో జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు దాడులు చేసి వారికి విముక్తి కల్పించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆ విభాగం ఏఎస్ఐ శ్రీహరి బాబు, పోలీస్ సిబ్బంది రాంబాబు చెప్పారు. ఈ ముగ్గురిని విశ్వ జననీ చైల్డ్ హోం కేర్‌లో చేర్చారు.
Similar News
News January 23, 2026
నెల్లూరు: సాగు మొదలైనా.. భూసార నివేదికలు ఎక్కడ?

జిల్లాలో వరి సాగు దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా జరుగుతోంది. సాగు మొదలై రెండో నెల అవుతున్నా భూసార నివేదికలు రైతన్నలకు అందలేదు. 31,231 నేల పరీక్షలు లక్ష్యం కాగా 30,785 నమూనాలు సేకరించారు. వీటిలో 23,306 శాంపిల్స్ పరీక్షించగా 14,104 SOIL హెల్త్ కార్డ్స్‌ను అందించారు. నేల స్వభావాన్ని అనుసరించి ఎరువుల వినియోగం జరగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. మిగిలిన కార్డ్స్ అందించే లోపు సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
News January 23, 2026
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి: కలెక్టర్

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగుల అందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
News January 23, 2026
కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


