News February 17, 2025
నెల్లూరు: బాలుడిపై లైంగిక దాడి

బాలుడి(10)పై మరో బాలుడు(17) లైంగికదాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. దుత్తలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిని ఎస్ఐ ఆదిలక్ష్మి ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. కావలి డిఎస్పీ శ్రీధర్, సీఐ వెంకట్రావు విచారణ జరిపారు. లైంగిక దాడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.
News April 12, 2026
నెల్లూరులో MPపై పోలీస్ కేసు నమోదు

నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. ఈక్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి తదితరులపై కేసు నమోదైంది.


