News May 21, 2024
నెల్లూరు: భారీగా నిలిచిన వాహనాలు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారు. వీటిని గ్రామస్థులు అడ్డుకున్నారు. నూతన రహదారి నిర్మాణ క్రమంలో పెద్దపడుగుపాడు గ్రామానికి ఊన్న దారిని మూసేస్తున్నారని చెప్పారు. తమ రోడ్డు అలాగే ఉంచాలంటూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు ఆందోళనకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
Similar News
News March 9, 2026
నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 9, 2026
ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిన నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక జరిగింది. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 9, 2026
కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.


