News December 1, 2025

నెల్లూరు: మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది..?

image

నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో వరుస సూసైడ్ కేసులు కలవరపెడుతున్నాయి. సరిగ్గా 2 నెలలకింద మెడికో విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా మరో మెడికో మృతి చెందింది. అయితే హాస్టల్స్‌ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందా?. విద్యార్థులు హాస్టల్స్‌లో ఉన్నప్పుడే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి?. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.

Similar News

News February 12, 2026

పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

image

పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.

News February 12, 2026

నెల్లూరులో పరీక్ష ఫీజులు ఇలా..!

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 2023-25, 2024-26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈనెల 17వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు డీఈవో బాలాజీరావు కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒకదానికి రూ.100 చెల్లించాలని సూచించారు.

News February 12, 2026

నెల్లూరు కలెక్టరా.. మజాకా!

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తనదైన మార్క్ చూపించారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ అనే సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.500 కోట్లతో ఏరో స్పేస్ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించింది. అక్కడ భూమి, ఇతర అనుమతులకు సంస్థ ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. వెంటనే నెల్లూరు కలెక్టర్ ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో దుత్తలూరు మండలంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు.