News October 23, 2024

నెల్లూరు: యువకుడి హత్యకు కారణం ఇదే..?

image

చిల్లకూరు మండలం నాచారం వద్ద హరి ప్రసాద్ సోమవారం రాత్రి <<14420718>>దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కాటయ్య వాలంటీర్‌గా పని చేసి, తరువాత టీడీపీకి మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలో కాటయ్యను హతమార్చాలని దుండగులు భావించారు. కాటయ్య చిన్నాన్న కుమారుడు హరిప్రసాద్ ఇంటికి వచ్చాడు. దుండగులు వారు ఉంటున్న కిటీకి అద్దాలు పగలగొట్టి పెట్రోల్‌తో నిప్పు పెట్టారు. దీంతో హరిప్రసాద్ బయటికి రాగా ఆయనను హత్య చేశారు.

Similar News

News November 12, 2024

అక్కంపేట కురిచర్లపాడు మధ్య రాకపోకలు బంద్

image

అక్కంపేట కురిచర్లపాడు మధ్యలో కల్వర్ట్ కుంగడంతో అక్కంపేట, కురిచర్లపాడు కసుమూరు మీదుగా నెల్లూరు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి తేలికపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పొట్టేలు కాలవ వంతెనకు ముందు పొలాల వద్ద ఉన్న కల్వర్ట్ మంగళవారం మధ్యాహ్నం కుంగిపోయింది. రాకపోకలకు విఘాతం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ముళ్లకంప వేసి రాకపోకలు బంద్ చేశారు.

News November 12, 2024

వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితురాలి అరెస్ట్

image

నెల్లూరులో ఎం.రమణి అనే వృద్ధురాలి హత్యకేసులో మూడో నిందితురాలిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సూట్ కేస్‌లో మ‌ృతదేహంతో చెన్నైలో పట్టుబడిన నిందితుడు బాలసుబ్రమ్మణంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బంగారు ఆభరణాల కోసమే తాను, తన భార్య సత్యవతి, కుమార్తెతో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో తండ్రిని, కుమార్తెను అరెస్ట్ చేశారు. కేసు మార్పు చేసి సత్యవతిని అరెస్ట్ చేశారు.

News November 12, 2024

మన నెల్లూరు జిల్లాకు బడ్జెట్‌లో వచ్చింది ఎంతంటే?

image

నిన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో నెల్లూరు జిల్లాకు ఎంత నిధులు కేటాయించారంటే..(కోట్లలో)
➤రామాయపట్నం పోర్టుకు రూ.100,
➤ కృష్ణపట్నం పోర్టుకు రూ.37
➤సోమశిల ప్రాజెక్టుకు రూ.209.55
➤ పెన్నా రివర్ కెనాల్ సిస్టంకు రూ.33.42
➤సోమశిల- స్వర్ణముఖి లింక్‌నకు రూ.66
➤కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.11
➤కనుపూరుకాలువకు రూ.7
➤ వీఎస్‌యూ రూ.20.69 కోట్లు