News March 4, 2025

నెల్లూరు: రిజ‌ర్వాయ‌ర్‌లో మహిళ డెడ్ బాడీ

image

వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్‌లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం ల‌భ్య‌మైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామ‌స్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Similar News

News December 14, 2025

నెల్లూరు కలెక్టర్‌కు రాజీనామా లేఖ పంపిన మేయర్

image

నెల్లూరు మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆదివారం మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా లేఖ ఆమోదించిన తర్వాతనే క్యాంపులో ఉండే కార్పొరేటర్లు నెల్లూరుకు వస్తారని సమాచారం.

News December 14, 2025

నెల్లూరులో ఎత్తులకు పైఎత్తులు.. మేయర్ ట్విస్ట్!

image

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కిడ్నాప్, బెదిరింపులకు దారి తీసింది. TDP, YCP నాయకులు పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలనే ఉద్దేశంతో TDP నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కొందరికి డబ్బులు ఆఫర్ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం కోసం ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే రాజీనామాతో స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఉండదని తెలుస్తోంది.

News December 14, 2025

15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

image

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.