News November 8, 2025

నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

image

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News January 24, 2026

కవాతు రిహార్సల్స్ పరిశీలించిన నెల్లూరు SP

image

26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల సిబ్బందికి సూచించారు. శనివారం నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కవాతు రిహార్సల్స్ ఆమె పరిశీలించారు. ఈ వేడుకలకు భద్రత ముఖ్యమని ప్రతి ఒక్కరినీ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేపట్టాలన్నారు. అలాగే గౌరవ వందనం చేసే సమయంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

News January 24, 2026

నెల్లూరుకు రూ.15 వేల కోట్లతో భారీ పరిశ్రమలు రాక

image

నెల్లూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇటీవల జరిగిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 13 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా కంపెనీలు MOU కుదుర్చుకున్నాయి. దీంతో జిల్లా పారిశ్రామిక నడవాగా మారనుంది. 13 పరిశ్రమల్లో రూ.15,403 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 37,213 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వీటిల్లో ఇప్పటికే 5 నుంచి 6 పరిశ్రమలకు భూ సేకరణ సైతం పూర్తి చేయగా.. మిగిలిన వాటికి స్థల సేకరణ జరుగుతోంది.

News January 24, 2026

నెల్లూరు: అటవీ శాఖ సగానికి.. సగం ఖాళీ..!

image

జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, కావలి, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో 2.29 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 167 పోస్టులకు 85 ఖాళీలు ఉండగా.. వాటిల్లో DRO 10 పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. FSO 21 పోస్టులకు 7, FBO 75 పోస్టులకు 22, ABO 61 పోస్టులకు 57 ఖాళీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం పక్కదారి పట్టడానికి ఇదొక కారణమని తెలుస్తోంది.