News March 20, 2024

నెల్లూరు: 943 మంది గైర్హాజరు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 943 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. హిందీ పరీక్ష రెగ్యులర్‌కు సంబంధించి 28,280 మందికి గాను 27,722 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్‌కు సంబంధించి 490 మంది విద్యార్థులకు గాను 385 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 16, 2026

28న జిల్లా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం

image

ఈనెల 28న ఉదయం గం.10.30లకు జిల్లా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ZP కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా విద్యాశాఖలతో పాటు ఇతర అధికారిక అంశాలపై సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు అందరూ హాజరు కావాలని ఆదేశించారు.

News March 16, 2026

కలెక్టర్‌ను కలిసిన జిల్లా గ్రంథాలయం ఛైర్మన్

image

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా మేకపాటి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు ఆమె పూల బొకే అందజేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.

News March 16, 2026

నెల్లూరు: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి.!

image

జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు JC వెంకటేశ్వర్లు తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఆలస్యం, అధిక ధరలు వసూలు చేయడం, గ్యాస్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు 9492273897 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.