News March 26, 2024
నెల్లూరు: YCP కీలక నేత గుండెపోటుతో మృతి

వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, నెల్లూరులో సీనియర్ రాజకీయ నాయకుడైన మున్వర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన కొంతకాలం క్రితం వైసీపీలో చేరారు. మున్వర్ హఠాన్మరణం చెందడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
Similar News
News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు(AWS) రైతులు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని చెప్పారు.