News November 19, 2025

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

image

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

Similar News

News January 19, 2026

నేడు అమలాపురంలో PGRS కార్యక్రమం

image

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆయన సూచించారు. పెండింగ్ అర్జీల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు.

News January 19, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదుల స్థితిని, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.