News February 5, 2025
నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.
Similar News
News February 19, 2025
‘ఆరెంజ్’ ఫ్లాప్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ రిప్లై!

రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను అప్పట్లో ఫ్లాప్ చేయడంపై ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అప్పుడు హిట్ చేసే వయసు మాకు రాలేదు. ఇంకో 50, 100 ఏళ్ల తర్వాత కూడా ఆరెంజ్ సినిమా క్లాసిక్’ అని రాసుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు. ‘చాలా థాంక్స్. సినీ పరిశ్రమ జీవితంలో అంతర్లీనం. కేవలం కొన్ని భావోద్వేగాలను చూపించాలనుకున్నా. కాబట్టి నాకు ఎటువంటి విచారం లేదు’ అని తెలిపారు.
News February 19, 2025
HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
News February 19, 2025
కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల వ్యాపారం: CAIT

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అంచనా వేశారు. దేశంలోనే ఇదో అతిపెద్ద ఎకనామిక్ ఈవెంట్ అన్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు పుంజుకున్నాయన్నారు. డైరీస్, క్యాలెండర్లు, జూట్ బ్యాగులు, స్టేషనరీ, ఫుడ్, పానీయాలు, పూజా సామగ్రి, హోటల్, వస్త్ర, రవాణా, కళాకృతులకు డిమాండ్ పెరిగిందన్నారు. కాశీ, అయోధ్యకూ ఈ క్రేజ్ పాకిందని పేర్కొన్నారు.