News September 13, 2025
నేటి సీఎం వరంగల్ పర్యటన వాయిదా..!

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు పర్యటనకు నేడు ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. మేడారం సమ్మక్క-సారలమ్మల అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్న సీఎం శనివారం వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, వర్షభావ పరిస్థితులు, పోలీసులకు మావోయిస్టులకు ఛత్తీస్గఢ్‌లో జరుగుతున్న ఎదురు కాల్పుల నేపథ్యంలో వాయిదా వేసినట్లు సమాచారం. తిరిగి మరో తేదీని ప్రకటించనున్నారు.
Similar News
News December 17, 2025
నాగర్‌కర్నూల్‌లో 83.1 శాతం పోలింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 83.1 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ జరగ్గా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే 77.82 శాతం పోలింగ్ పూర్తి కావడం విశేషం.
News December 17, 2025
వీర్నపల్లి సర్పంచ్‌గా జ్యోత్స్న విక్టరీ

వీర్నపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప అభ్యర్థి భూత భాగ్యలక్ష్మీపై జ్యోత్స్న గెలుపొందారు. బరిలో ఏడుగురు పోటీపడగా 205 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గ్రామప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News December 17, 2025
శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ?

శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతను మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం నుంచి ఉత్తర్వులు రానున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ని 26 జిల్లాలకు కొత్త టీడీపీ అధ్యక్షుల పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.


