News November 17, 2025

నేడు అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్‌’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ఈ నెల 17న (సోమవారం) అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.

Similar News

News January 24, 2026

మంచిరోని మామిళ్లలో పెద్దపులి కలకలం..!

image

తుర్కపల్లి మండలంలోని మంచిరోని మామిళ్ల గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తుండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ సమీపంలోని బావి వద్ద పులిని చూసినట్లు ఓ బాటసారి తెలపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పాదముద్రలను సేకరించి అది పులేనా లేక ఇతర క్రూర మృగమా అని నిర్ధారించే పనిలో పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News January 24, 2026

VJA: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

image

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.

News January 24, 2026

బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

image

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.