News December 1, 2025

నేడు అమలాపురంలో యథావిధిగా PGRS: కలెక్టర్

image

అమలాపురంలోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా వేదిక నిర్వహిస్తామన్నారు. స్వీకరించిన అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 16, 2026

విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

image

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.

News February 16, 2026

ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…

image

కర్పూరానికి ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు. రోజూ సాయంత్రం కర్పూరం వెలిగిస్తే ప్రతికూల శక్తి నశించి, సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కర్పూరం చంద్ర, శుక్ర గ్రహాలకు ప్రతీక. దీన్ని వెలిగిస్తే పితృదోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కర్పూర సువాసన గాలిలోని బ్యాక్టీరియాను హరించి ఆరోగ్యకర వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

News February 16, 2026

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి పొనుగుపాటి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పొనుగుపాటి శ్రీనివాస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తనను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారని శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.