News December 1, 2025

నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

image

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’

Similar News

News February 16, 2026

రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు: అమిత్ షా

image

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు <<19151159>>ద్రోహం చేస్తోందని<<>> రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.

News February 16, 2026

అటు బంగ్లా, ఇటు పాక్‌‌కు చెక్ పెట్టిన భారత్

image

తమ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి పౌరులకు భద్రత కల్పించిన భారత్‌లోనే రక్షణ లేదంటూ బంగ్లాదేశ్ అహంకారం ఒకవైపు. ‘మేం కూడా భారత్‌తో మ్యాచ్ ఆడం’ అంటూ చివరి వరకు నక్క తెలివితేటలు చూపిన పాకిస్థాన్ మరోవైపు. ఈ రెండు దేశాల తలపొగరును <<19153355>>తన ఆటతో<<>> దించేసింది టీమ్ ఇండియా. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ మాదిరిగా చాలా పద్ధతిగా, సమష్టిగా దెబ్బకొట్టింది. ‘తగ్గేదేలే’ అంటూ భారత్ మరోసారి సత్తా చాటింది.

News February 16, 2026

TODAY HEADLINES

image

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!