News December 2, 2025

నేడు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రాక

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News February 13, 2026

జనగామలో ఛైర్మన్ పీఠానికి స్వతంత్రులే కీలకమా..!

image

జనగామ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠానికి స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. కాంగ్రెస్-12 సీట్లు, బీఆర్ఎస్-13 సీట్లు, సీపీఐ-1 సీటు, స్వతంత్ర అభ్యర్థులు-4 సీట్లు వచ్చాయి. సీపీఐ, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు.

News February 13, 2026

నగరంలో 291 మంది పోలీసులకు రివార్డులు

image

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.

News February 13, 2026

రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

image

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.