News February 10, 2025

నేడు కొడంగల్‌‌కు KTR.. షెడ్యూల్ ఇదే!

image

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు కొడంగల్‌లో పర్యటిస్తారు.
షెడ్యూల్ వివరాలు:
10:30AM-నార్సింగిలోని నివాసం నుంచి బయలుదేరుతారు
12:30PM-పరిగి మాజీ MLA కొప్పుల మహేశ్ ఇంట్లో లంచ్
01:40PM-కొడంగల్‌ తున్కిమెట్లలో BRS పార్టీ జెండా ఆవిష్కరణ
02:00PM-హకీంపేట్, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా రైతులకు పరామర్శ
03:00PM-కోస్గి చౌరస్తాలో రైతు మహా ధర్నాలో పాల్గొంటారు.

Similar News

News February 16, 2026

పత్తిలో కలుపు సమస్య- నివారణకు సూచనలు

image

☛ పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి. ☛ వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.

News February 16, 2026

సిరిసిల్ల: కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఆర్డీవో

image

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లతో ఆర్డీవో వెంకటేశ్వర్లు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన 5 గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ సమావేశానికి హాజరు కాలేదు.

News February 16, 2026

జేఈఈ మెయిన్ ఫైనల్ కీ రిలీజ్

image

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో NTA ఫైనల్ కీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళ వెల్లడిస్తామని 4రోజుల కిందట అప్డేట్ ఇచ్చింది. తాజాగా కీ విడుదల కాగా ఏ క్షణంలోనైనా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.