News April 25, 2024
నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం ఉదయం 10:30కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని కాల్వఒడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హఫీజుద్దీన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News April 18, 2026
ఖమ్మం జిల్లాలో 41.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత

ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, కల్లూరు మండలాల్లో 41.6 డిగ్రీలు నమోదవగా, కల్లూరు, రఘునాథపాలెం, ఏన్కూర్ ప్రాంతాల్లో 41.4 నుంచి 41.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెనుబల్లి, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో 41.2 నుంచి 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఖమ్మం: వానాకాలం సాగుకు విత్తనాలు సిద్ధం

ఖమ్మంలో వానకాలం సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకుని 30 వేల క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వరితో పాటు పెసర, మినుము, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.