News April 14, 2024

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరావును ప్రకటించగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News December 10, 2025

మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

image

డిసెంబర్ 11న జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 7మండలాల పరిధిలో 172పంచాయతీలు, 1,740వార్డులలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే కేంద్రాల్లో ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 2,41,137మంది ఓటర్లు ఉండగా, 20 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 360క్రిటికల్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 162సెన్సిటివ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.