News September 13, 2025

నేడు గద్వాలలో పర్యటించనున్న కేటీఆర్

image

కేటీఆర్ నేడు గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా గద్వాల నియోజకవర్గ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. రాయచూరు రోడ్డు నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాత బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Similar News

News December 5, 2025

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

image

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.

News December 5, 2025

సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

image

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 5, 2025

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా రమేశ్ రెడ్డి

image

కాళోజీ హెల్త్ వర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌‌గా ప్రభుత్వం రమేశ్ రెడ్డిని నియమించింది. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న ఆయనను కాళోజీ హెల్త్ వర్సిటీకి ఇన్‌ఛార్జి వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నేడు పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో DMEగా పనిచేశారు. గతంలో ఉన్న వీసీపై ఆరోపణలు రావడంతో నందకుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.